Header Banner

అమ్మాయిలు అదరగొట్టేశారు.. టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్! ఫైనల్‌లో దక్షిణాఫ్రికా చిత్తు..

  Sun Feb 02, 2025 16:49        Sports

టీమిండియా అమ్మాయిలు అదరగొట్టేశారు. ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ లో విజేతలుగా నిలిచారు. ఇవాళ మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో జరిగిన టోర్నీ ఫైనల్లో భారత మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 83 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 11.2 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది. బౌలింగ్ లో 3 వికెట్లు తీయడమే కాకుండా, ఓపెనర్ గా బరిలో దిగి 33 బంతుల్లో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. త్రిష స్కోరులో 8 ఫోర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ జి.కమలిని 8 పరుగులకే అవుటైనా... వన్ డౌన్ బ్యాటర్ సనికా చల్కేతో కలిసి త్రిష ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించింది. సనికా చల్కే 22 బంతుల్లో 4 ఫోర్లతో 26 పరుగులు చేసింది. సనికా చల్కే విన్నింగ్ షాట్ గా ఫోర్ కొట్టి టీమిండియా శిబిరాన్ని సంబరాల్లో ముంచెత్తింది.  సఫారీ బౌలర్లలో కెప్టెన్ కేలా రీనెకె 1 వికెట్ తీసింది. కాగా, ఇప్పటివరకు ఈ టోర్నీ రెండు సార్లు నిర్వహించగా... రెండు పర్యాయాలు టీమిండియానే టైటిల్ సాధించింది. 2023లో జరిగిన ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ లో టీమిండియ ఫైనల్లో ఇంగ్లండ్ ను ఓడించి చాంపియన్ గా నిలిచింది. ఇప్పుడు వరుసగా రెండోసారి టోర్నీలో విజేతగా అవతరించింది.

 

ఇంకా చదవండి: జగన్ షాక్: సంచలనంగా మారిన షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్! PMDDKY పథకం ఎలా ఉపయోగపడుతుందంటే?

 

మటన్ ప్రియులకు షాకింగ్ అలర్ట్! తిన్న వెంటనే ఇవి తింటే ఏం జరుగుతుందో తెలుసా?

 

బ‌డ్జెట్‌-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవి, పెరిగేవి ఇవే!

 

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లు, కార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

టీడీపీ కార్యాలయంలో కోపగించుకున్న లోకేష్! ప్రోటోకాల్ పేరుతో పోలీసుల అత్యుత్సాహం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #ICCUnder19Womens #T2 Worldcup #GongadiTrisha #TeamIndia #SouthAfrica #Malaysia